యథేచ్ఛగా అక్రమ మట్టి రవాణా

ఖమ్మం: నేలకొండపల్లిలో ఎలాంటి అనుమతులు లేకుండా మట్టి అక్రమ రవాణా యథేచ్ఛగా సాగుతోంది. అధికారులు హెచ్చరించినా టిప్పర్లు, జేసీబీలతో బహిరంగంగానే మట్టిని తరలిస్తున్నారు. మైనింగ్ శాఖ అనుమతులు లేవని స్పష్టం చేసినా, ఈ దందా ఆగడం లేదు. అధికారుల నిర్లక్ష్యం వల్లే ఇది జరుగుతోందని స్థానికులు ఆరోపిస్తున్నారు. అధికారులు ఇప్పటికైనా చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.