జగన్‌పై బుద్ధా వెంకన్న ఫైర్

జగన్‌పై బుద్ధా వెంకన్న ఫైర్

AP: 'మావిగన్' ట్రోల్స్ నుంచి తప్పించుకోవడానికే జగన్ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని TDP నేత బుద్దా వెంకన్న విమర్శించారు. సాక్షిలో అమరావతి మహిళలను అవమానించినప్పుడు, అసెంబ్లీలో భువనేశ్వరిని దూషించినప్పుడు జగన్ ఎందుకు స్పందించలేదని ప్రశ్నించారు. సొంత సోదరిని తిట్టించి ఇప్పుడు మహిళా హక్కుల గురించి మాట్లాడటం విడ్డూరమన్నారు. వచ్చే ఎన్నికల్లో ఆయనకు ఓటమి తప్పదని ఎద్దేవా చేశారు.