ఇరుగులమ్మ అమ్మవారికి ప్రత్యేక పూజలు

KDP: సిద్దవటం మండలంలోని మూలపల్లె క్రాస్ వద్ద వెలసిన ఇరుగులమ్మ అమ్మవారికి ఆదివారం ప్రత్యేక పూజలు జరిగాయి. ఈ సందర్భంగా.. ఆలయ అర్చకుడు అమ్మవారికి జలాభిషేకం, కుంకుమార్చన వంటి పలు అభిషేకాలు నిర్వహించారు. భక్తులు అమ్మవారిని దర్శించుకుని కాయ కర్పూరాలను సమర్పించి, మొక్కులు తీర్చుకున్నారు. అనంతరం తీర్థప్రసాదాలను స్వీకరించారు.