భద్రాద్రి రామాలయంలో బంగారం, వెండికి జియో ట్యాగింగ్

కొత్తగూడెం: భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి దేవస్థానంలోని బంగారం, వెండికి త్వరలో జియో ట్యాగింగ్ విధానం అమల్లోకి తీసుకొస్తున్నట్టు ఈఓ ఎల్. రమాదేవి బుధవారం వెల్లడించారు. ఆలయంలో బంగారం, వెండి ఆభరణాలపై ఆడిట్ నడుస్తోందని, బంగారం లెక్కల్లో తేడా ఉన్నట్లు వస్తున్న వార్తలు అవాస్తవమని ఈఓ రమాదేవి చెప్పారు. అయితే వెండి అసలు లెక్కలో కొద్దిగా తేడా వచ్చిందన్నారు.