3 రోజుల క్రితం భార్య.. నేడు భర్త మృతి
MBNR: నవాబుపేట (M) జంగమయ్య పల్లిలో విషాదకర సంఘటన చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన రవి (26), లావణ్య దంపతులు వ్యవసాయం చేసుకొని జీవిస్తున్నారు. అప్పుల బాధతో 3 రోజుల క్రితం భార్య ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. భర్త కూడా ఆత్మహత్యకు పాల్పడగా.. కొన ఊపిరితో ఉండగా.. ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ ఇవాళ తెల్లవారుజామున రవి మృతి చెందాడు.