'పిచ్చి కుక్కల బెడద నుండి కాపాడండి'

ASF: కాగజ్ నగర్ పట్టణంలో పిచ్చి కుక్కల బెడద నుండి కాపాడాలని పట్టణ ప్రజలు కోరుతున్నారు. పలువురు ప్రజలు మాట్లాడుతూ.. వీధుల్లో పిచ్చి కుక్కలు స్వైర విహారం చేస్తున్నాయని అన్నారు. నడుచుకుంటూ వెళ్లే వారిపై దాడులు చేస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు, స్థానిక ఎమ్మెల్యే స్పందించి కుక్కల బెడద నుండి కాపాడాలని కోరారు.