VIDEO: భారీ వర్షం.. విశాఖ కేజీహెచ్‌లో రోగుల అవస్థలు

VSP: విశాఖలో శనివారం సాయంత్రం కురిసిన భారీ వర్షంతో కింగ్ జార్జ్ ఆసుపత్రిలో అత్యవసర, క్యాజువాలిటీ, రక్తపరీక్ష, మందుల గదుల వద్ద వర్షపు నీరు చేరింది. దీంతో రోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఆసుపత్రి భవనాలు శిథిలావస్థకు చేరడంతో పలుచోట్ల స్లాబుల నుంచి లీకేజీ అవుతోంది. దీంతో వరద నీటిలోనే రోగులు చికిత్స పొందాల్సిన పరిస్థితి నెలకొంది.