మాతృ మరణాల సమీక్షా సమావేశం

మాతృ మరణాల సమీక్షా సమావేశం

GNTR: జిల్లాలో మాతృ మరణాలను సమీక్షించేందుకు సోమవారం సబ్-డిస్ట్రిక్ట్ లెవెల్ సమావేశం గుంటూరులో జరిగింది. డీఎంహెచ్‌వో డాక్టర్ విజయలక్ష్మి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో జూలై, ఆగస్టు నెలల్లో నమోదైన మూడు మాతృ మరణాలను కమిటీ సమీక్షించింది. గర్భిణులకు తరచుగా పరీక్షలు నిర్వహించాలని, పౌష్టికాహారంపై అవగాహన కల్పించాలని ఆమె సూచించారు.