తాడేపల్లిగూడెంలో దొంగతనం:ఎస్సై

తాడేపల్లిగూడెంలో దొంగతనం:ఎస్సై

W.G: తాడేపల్లిగూడెం(M) కుంచనపల్లి వాసవి టౌన్ షిప్ లో వెలివెల లీలారాణి రాంబాబు దంపతుల నివాసంలో చోరీ జరిగినట్లు రూరల్ ఎస్సై జేవీఎన్ ప్రసాద్ బుధవారం రాత్రి తెలిపారు. ఈ నెల 8న పోతవరం వెళ్లిన దంపతులు తిరిగి 17వ తేదీన వచ్చి చూసే సరికి ఇంటి తాళాలు పగలగొట్టి ఉన్నాయన్నారు. 10 కాసుల బంగారు వస్తువులు, వెండి సామాగ్రి కనిపించడం లేదని లీలారాణి ఫిర్యాదులో పేర్కొన్నారు.