'గ్రంథాలయ ఉద్యోగుల సమీక్ష సమావేశం'
ఉమ్మడి విశాఖ జిల్లా కేంద్ర గ్రంథాలయంలో గ్రంథాలయ సంస్థ అధ్యక్షుడు వన్నెం రెడ్డి సతీష్ కుమార్ అధ్యక్షతన ఉద్యోగుల సమీక్ష సమావేశం జరిగింది. జిల్లాలోని గ్రంథాలయాల అభివృద్ధిపై ఉద్యోగుల అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా గ్రూప్–2 పరీక్షల్లో విజయం సాధించిన ముగ్గురు ఉద్యోగులను సత్కరించారు. ఈ కార్యక్రమంలో కార్యదర్శి బుర్రి కుమార్ రాజు పాల్గొన్నారు.