జాతీయస్థాయి ఖో ఖో పోటీలకు ఎంపికైన విద్యార్థులు
ప్రకాశం: 69వ స్కూల్ గేమ్స్ ఆటల పోటీల్లో అండర్ 14 ఖో ఖో డివిజనల్ పోటీలు ఒంగోలు డీఆర్ఆర్ఎమ్ హైస్కూల్లో జరిగాయి. ఈ పోటీల్లో టంగుటూరు విద్యార్థులు కుందేటి కార్తీక్, టీ. శశిరేఖ జిల్లా స్థాయి ఖో ఖో పోటీలకు ఎంపికయ్యారు. ఈ సందర్భంగా వారిని ప్రధానోపాధ్యాయురాలు తులసి ప్రభ, పీడీ అరుణ, పాఠశాల ఉపాధ్యా యులు తదితరులు అభినందించారు.