'పోషణ మాసోత్సవాలు విజయవంతం చేయాలి'

KNR: ఈనెల 17 నుంచి వచ్చే నెల 16 వరకు జిల్లాలో నిర్వహించనున్న పోషణ మాసోత్సవాలను విజయవంతం చేయాలని అడిషనల్ కలెక్టర్ అశ్విని తానాజీ వాకడే అన్నారు. మహిళాభివృద్ధి శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించనున్న పోషణ మాసోత్సవాలపై వివిధ శాఖల అధికారులతో సోమవారం కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో సమన్వయ సమావేశం ఏర్పాటు చేశారు.