ముగిసిన మున్సిపల్ కౌన్సిల్ పదవీకాలం

ముగిసిన మున్సిపల్ కౌన్సిల్ పదవీకాలం

ATP: గుంతకల్లు పురపాలక సంఘం ఐదేళ్ల కౌన్సిల్ పదవీకాలం ముగియడంతో మంగళవారం ఛైర్‌పర్సన్ ఎన్. భవాని అధ్యక్షతన చివరి సమావేశం నిర్వహించారు. కౌన్సిలర్లను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో కమిషనర్ లక్ష్మీదేవి, వైస్ ఛైర్మన్‌లు నైరుతి రెడ్డి, మేమున్, కౌన్సిలర్లు పాల్గొన్నారు. వార్డు సమస్యల చర్చతో పాలకవర్గ ప్రయాణం ముగిసింది.