బీఆర్‌ఎస్ మెజారిటీ గెలుపు: ఎర్రబెల్లి, అరూరి
WGL: వర్ధన్నపేట మున్సిపాలిటీ ఎన్నికల్లో 12 వార్డుల్లో మెజారిటీ బీఆర్‌ఎస్ గెలుస్తుందని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు, మాజీ ఎమ్మెల్యే అరూరి రమేష్ ధీమా వ్యక్తం చేశారు. గత ప్రభుత్వ హయాంలో రూ. 200 కోట్లతో అభివృద్ధి చేశామని, 100 పడకల ఆసుపత్రి కోసం బీఆర్‌ఎస్ పోరాడిందన్నారు. అభివృద్ధి చేయకుండా కాంగ్రెస్ ప్రజలను తప్పుదోవ పట్టిస్తోందని విమర్శించారు.