కడుపు నొప్పితో చిన్నారి మృతి
SDPT: మర్కుక్ మండలం పాతూర్ గ్రామంలో విషాద ఘటన చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన బీంటు(3) ఏప్రిల్ 5 రాత్రి కడుపులో నొప్పి ఉందని చెప్పడంతో తల్లిదండ్రులు గజ్వేల్‌లోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. అక్కడ పరిస్థితి విషమంగా మారడంతో హైదరాబాద్‌లోని ఆస్పత్రికి తరలించగా, చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందాడు. మృతదేహాన్ని గజ్వేల్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.