దొంగతనాలకు పాల్పడుతున్న వ్యక్తి అరెస్ట్

దొంగతనాలకు పాల్పడుతున్న వ్యక్తి అరెస్ట్

కృష్ణా: ఒంటరి మహిళలను లక్ష్యంగా చేసుకుని దొంగతనాలకు పాల్పడుతున్న వ్యక్తిని పెనుమలూరు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈనెల 13వ తేదీన కానూరు మహదేవపురం కాలనీలో ఓ మహిళ నడుచుకుంటూ వెళ్తుండగా లంకాడి వెంకటేష్‌ మహిళ మెడలోని గొలుసును లాక్కెళ్లాడు. సీసీ కెమెరాల ఆధారంగా దర్యాప్తు చేయగా అసలు విషయం బయటపడింది. నిందితుడి నుంచి రూ.5 లక్షల బంగారం స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు.