మార్కాపురంలో వద్దని కొందరి వాదన

ప్రకాశం: ప్రస్తుతం మార్కాపురం జిల్లా ఏర్పాటుపై చర్చ సాగుతోంది. దర్శి, యర్రగొండపాలెం, మార్కాపురం, గిద్దలూరుతో జిల్లా ఏర్పడవచ్చని పలువురు భావిస్తున్నారు. ఈ క్రమంలో మార్కాపురం జిల్లాలో కలిసే మండలాల ప్రజలు భిన్నరీతిలో తమ వాదన వినిపిస్తున్నారు. దర్శి నియోజకవర్గం తాళ్లూరు, ముండ్లమూరు మండలాలను ప్రకాశంలోనే కొనసాగించాలని కోరుతున్నారు.