ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే కార్యాలయం ముట్టడి
MHBD: ఎస్ఎఫ్ఐ జిల్లా కమిటీ సభ్యులు ఎండీ.అమీర్ ఆధ్వర్యంలో సోమవారం తొర్రూరు డివిజన్ కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయాన్ని ముట్టడించారు. పెండింగ్‌లో ఉన్న స్కాలర్‌షిప్, ఫీజు రియంబర్స్‌మెంట్ బకాయిలను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం విద్యార్థులకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని కోరారు. లేని యెడల ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు.