తుఫాన్ బాధిత రైతులను పరామర్శించనున్న మాజీ సీఎం
కృష్ణా: మొంథా తుఫాన్ ప్రభావంతో పంటలు నష్టపోయిన రైతులను పరామర్శించేందుకు మాజీ సీఎం వైఎస్ జగన్ ఈ నెల 4న కృష్ణా జిల్లా పెడన నియోజకవర్గంలోని గూడూరు ప్రాంతంలో పర్యటించనున్నారు. ఈ మేరకు తుఫాన్ వల్ల తీవ్రంగా దెబ్బతిన్న రైతులను ప్రత్యక్షంగా కలిసి వారి సమస్యలను తెలుసుకోనున్నారు. ఈ మేరకు నష్టపరిహారం, పునరావాస చర్యలపై రైతుల నుంచి అభిప్రాయాలు సేకరించనున్నట్లు సమాచారం.