జిల్లాలో ఘోర ప్రమాదం.. ఇద్దరు వ్యక్తుల దుర్మరణం
సూర్యాపేట జిల్లాలో ఈరోజు జరిగిన రోడ్డు ప్రమాదంలో మేళ్లచెరువుకు చెందిన జనిగె సతీష్, నర్సింహారావు మృతి చెందారు. చివ్వెంల ముత్యాలమ్మ గుడి నుంచి దురాజ్ పల్లి వెళ్తుండగా వీరి బొలెరోను DCM ఢీకొట్టింది. ఈ ఘటనలో మరో పలువురు వ్యక్తులకు గాయాలయ్యాయి. తెల్లవారుజామున జరిగిన ఈ ప్రమాదం స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపింది. పోలీసులు విచారణ చేపట్టారు.