'రాజమండ్రిలో నిబంధనలకులోబడి నిర్మాణాలు జరగాలి'
E.G: రాజమండ్రిలో గురువారం ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ నగర పాలక సంస్థ టౌన్ ప్లానింగ్ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా నిబంధనలకులోబడి నిర్మాణాలు జరగాలని, అలా కానీ యెడల చట్టపరమైన చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. నిబంధనలకు వ్యతిరేకంగా ఎవరు ప్రవర్తించినా చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఆయన ఆదేశించారు.