చంద్రబాబు, పవన్ చిత్రపటాలకు పాలాభిషేకం

కోనసీమ: గీత కార్మికుల శ్రేయస్సు కోసం కూటమి ప్రభుత్వం నిరంతర కృషి చేస్తుందని టీడీపీ నాయకుడు బండారు సంజీవ్ పేర్కొన్నారు. గీత కార్మికులకు మద్యం పాలసీలో 10% కేటాయించడంపై కూటమి ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలుపుతూ ఆదివారం రావులపాలెం క్యాంపు కార్యాలయం వద్ద CM చంద్రబాబు, Dy.CM పవన్ చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు.