సమస్యలు పరిష్కరించాలి: ఎస్పీ

సమస్యలు పరిష్కరించాలి: ఎస్పీ

చిత్తూరు జిల్లా పోలీసు కార్యాలయంలో ఎస్పీ తుషార్ డూడీ ఆధ్వర్యంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం సోమవారం జరిగింది. బాధితుల నుంచి ఎస్పీ అర్జీలు స్వీకరించారు. వివిధ సమస్యలపై 43 ఫిర్యాదుల అందినట్టు అధికారులు వెల్లడించారు. ఇందులో అత్యధికంగా ఆస్తి తగాదాలు 9, భూతగాదాలు 10 ఫిర్యాదులు అందాయన్నారు. వీటిని సత్వరమే పరిష్కరించాలని ఎస్పీ ఆదేశించారు.