ఓవర్ హెడ్ ట్యాంక్ నిర్మాణానికి భూమి పూజ

సత్యసాయి: గోరంట్ల మండల పరిధిలోని వానవోలు గ్రామంలో ఓవర్ హెడ్ ట్యాంక్ నిర్మాణం కోసం మండల టీడీపీ కన్వీనర్ బాలకృష్ణ చౌదరి, మాజీ ఎంపీపీ నిమ్మల విద్యా ధరణి భూమి పూజ చేసి పనులను ప్రారంభించారు. జల జీవన్ మిషన్ పథకం కింద ఓవర్ హెడ్ ట్యాంక్ వానవోలుకు మంజూరు అయింది. శనివారం భూమి పూజ చేసి నిర్మాణ పనులను ప్రారంభించారు.