సీఏ పరీక్షలపై ICAI కీలక నిర్ణయం
సీఏ ఫైనల్ పరీక్షలు ఇక నుంచి ఏడాదికి రెండుసార్లు జరుగుతాయని ఐసీఏఐ తెలిపింది. మే సెషన్ నుంచే ఈ కొత్త విధానం ప్రారంభమవుతుందని పేర్కొంది. ఈ పరీక్షలు ప్రస్తుతం ఏడాదిలో మూడు సార్లు జరుగుతుండగా.. ఇకపై మే, నవంబరులో మాత్రమే జరుగుతాయని వెల్లడించింది. విద్యార్థుల నుంచి వచ్చిన ఫీడ్ బ్యాక్ ఆధారంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఐసీఏఐ జాయింట్ డైరెక్టర్ ఆనంద్ కుమార్ తెలిపారు.