రైతు ఆత్మహత్యాయత్నం.. కారణం ఇదే?
CTR: కార్వేటినగరం మండలంలో ఓ రైతు ఆత్మహత్యకు యత్నించిన విషయం తెలిసిందే. పోలీసుల వివరాల మేరకు.. దిగువ ఎర్రమరాజుపల్లిలో ప్రభుత్వ భూమిని సదరు రైతు ఆక్రమించారని కొందరు ఫిర్యాదు చేశారు. స్థానిక రెవెన్యూ, పోలీస్ శాఖ భూమి సర్వే చేయగా 155/1 గల సర్వే నంబర్లు ప్రభుత్వ భూమిగా గుర్తించారు. దీంతో ఆ రైతు ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్లు తెలుస్తోంది.