పుట్టపర్తి జిల్లా కేంద్రం తరలింపుపై ఆందోళన

సత్యసాయి: పుట్టపర్తి మండలంలో జిల్లా కేంద్రం తరలింపుపై ఉద్రిక్తతలు చెలరేగుతున్నాయి, ఈ తరలింపు జరిగితే తప్పనిసరిగా ఉద్యమం జరుగుతుందని స్థానికులు హెచ్చరిస్తున్నారు. ఈ నేపథ్యంలో త్వరలోనే అఖిలపక్ష మేధావుల ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించనున్నట్లు వైసీపీ నేతలు పిలుపునిచ్చి ప్రజల మద్దతు కోరుతున్నారు.