విద్యుత్ ప్రమాదాలపై అప్రమత్తంగాఉండాలి: ఏఈ
VKB: జిల్లా పరిగి మండలం, టౌన్ వాసులకు ఏఈ హరికృష్ణ బుధవారం విద్యుత్ సూచనలు చేశారు. వర్షాల కారణంగా వర్షానికి తడిసిన ఇనుప స్తంభాలను ముట్టుకోవడం, మొబైల్ ఛార్జింగ్ ఉండగా తడి చేతులతో ముట్టడం, మాట్లాడటం చేయకూడదన్నారు. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురుస్తున్నప్పుడు ఇంట్లో ఉండే టీవీ, ఫ్రిడ్జిలు, స్విచ్‌లు ఆఫ్ చేసి ప్లగ్ తీయాలని ఆయన సూచించారు.