విస్తృతంగా గాలింపు చర్యలు
ASR: మావోయిస్టుల పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీ వారోత్సవాలు నేటి నుంచి ఈనెల 8 వరకు జరగనున్న నేపథ్యంలో జిల్లాలో పోలీసులు అప్రమత్తమయ్యారు. ఏవోబీ, మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో ముమ్మరంగా తనిఖీలు చేపడుతున్నారు. పీఎల్ జీఏ వారోత్సవాల్లో భాగంగా మావోయిస్టులు తమ ఉనికి చాటుకునే ప్రయత్నం చేస్తారు. ఈ క్రమంలో జీకేవీధి, కొయ్యూరులో పోలీసులుగాలింపు చర్యలు చేపట్టారు.