వాయిపేట్‌లో నూతన కమిటీ ఏర్పాటు

ADB: సిరికొండ మండలం వాయిపేట్‌లో ఆదివారం రాజీవ్ గాంధీ పంచాయతీరాజ్ సంఘటన్ నూతన కమిటీని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా సంఘటన్ అధ్యక్షుడు సదానందం పలు గ్రామాల్లో పర్యటించి పలువురిని కమిటీలో చేర్చారు. నిత్యం ప్రజల పక్షాన పని చేయాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఇమామ్, గోపాల్, అవినాష్, పరుశురాం, ఆనందరావు, దేవిదాస్, భాస్కర్, శ్రీనివాస్ తదితరులున్నారు.