PGRSను నిర్వహించిన కలెక్టర్ విజయకృష్ణన్

PGRSను నిర్వహించిన కలెక్టర్ విజయకృష్ణన్

అనకాపల్లి కలెక్టరేట్‌లో సోమవారం PGRS కార్యక్రమాన్ని కలెక్టర్ విజయకృష్ణన్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్, జాయింట్ కలెక్టర్ జాహ్నవి ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు. ప్రజలతో మాట్లాడి, అర్జీలను సంబంధిత అధికారులకు పంపించారు. సత్వర పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు. ప్రతి సోమవారం నిర్వహించే ఈ కార్యక్రమాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.