పొంగుతున్న వాగులు, వంకలు

RR: ఇటీవల కురుస్తున్న వర్షాలకు వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. ఎగువన కురిసిన వర్షాలకు నందిగామ మండలంలో దాదాపుగా అన్ని చెరువులు నిండిపోయాయి. నందిగామ నర్సప్పగూడ, వీర్లపల్లి, అప్పారెడ్డిగూడ తదితర గ్రామాల సమీపంలో ఉన్న వాగులు పొంగిపొర్లుతున్నాయి. నర్సప్పగూడ వద్ద ఉన్న అక్కమ్మ చెరువు, నందిగామలోని నల్లవాగు పెద్దఎత్తున ప్రవహిస్తున్నాయి.