పాఠశాలలో ఆకస్మిక తనిఖీ చేసిన మంత్రి సవిత

సత్యసాయి: రొద్దం మండలం పెదమంతూరు పంచాయతీ పి. రొప్పాల గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను మంత్రి సవిత ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా విద్యార్థులకు అందిస్తున్న మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించి వారితో కలిసి భోజనం చేశారు. బాగా చదివి ఉన్నత స్థాయికి ఎదగాలని సూచించారు.