సీతంపేటలో సమావేశ మందిరం, అతిథి గృహ ప్రారంభం
VSP: సీతంపేటలో శ్రీకృష్ణ యువజన సేవా సంఘం ఆధ్వర్యంలో నిర్మించిన సమావేశ మందిరం, అతిథి గృహాన్ని దక్షిణ ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ శనివారం ప్రారంభించారు. ఈ సంఘం గ్రామ-వార్డు అభివృద్ధిలో కీలకంగా పనిచేస్తుందన్నారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన కమిటీని అభినందించారు.