ఘనంగా బడిబాట కార్యక్రమం
SRCL: చందుర్తి మండలం సనుగుల గ్రామంలో గ్రామంలోని ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయులు, గ్రామపంచాయతీ పాలకవర్గము మంగళవారం బడిబాట కార్యక్రమాన్ని నిర్వహించారు. గ్రామ శివారులోని అటవీ ప్రాంతమైన మైసమ్మ గుట్ట వద్ద పనులు చేస్తున్న ఉపాధి హామీ కూలీలతో ప్రభుత్వ పాఠశాలల యొక్క పనితీరును వివరించారు. పిల్లలను ప్రభుత్వ పాఠశాలకు పంపించాలని కోరారు.