ఈ నెల 26న నగరిలో వాహనాలకు వేలంపాట
CTR: నగరి ప్రొహిబిషన్, ఎక్సైజ్ స్టేషన్ పరిధిలో వివిధ కేసుల్లో పట్టుకున్న వాహనాలకు ఈ నెల 26న ఉదయం 11.00 గంటలకు బహిరంగ వేలం వేయనున్నట్లు సీఐ మురళీమోహన్ తెలిపారు. ఆసక్తి గలవారు ఆధార్ కార్డు, పాన్ కార్డు తీసుకుని, వేలం పాటలో ప్రభుత్వం నిర్ణయించిన ధరలో 10% శాతం ధరావత్తు సొమ్మును ముందుగా చెల్లించాలని సూచించారు.