కోటనందూరులో ‘ఇది మంచి ప్రభుత్వం’ కార్యక్రమం

EG: మండల కేంద్రం కోటనందూరులో టీడీపీ నాయకులు శుక్రవారం ‘ఇది మంచి ప్రభుత్వం’ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు గ్రామంలో ఇంటింటికీ వెళ్లి ప్రభుత్వ పథకాలు తెలియజేశారు. అనంతరం కార్యక్రమానికి సంబంధించిన స్టిక్కర్లను పలు ఇళ్ల గోడలకు అతికించారు. కార్యక్రమంలో టీడీపీ మండలాధ్యక్షుడు గాడి రాజుబాబు,టీడీపీ, జనసేన నాయకులు పాల్గొన్నారు.