రోడ్డు ప్రమాదంలో గాయపడిన వ్యక్తి మృతి

KDP: ఈ నెల 18న రాత్రి రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన మంచాల నవీన్ (22) అనే యువకుడు బుధవారం కర్నూల్‌లో చికిత్స పొందుతూ మృతి చెందారు. జమ్మలమడుగుకు చెందిన నవీన్ ప్రొద్దుటూరు బైపాస్‌లో బైక్‌పై వెళుతూ ప్రమాదవశాత్తు కిందపడ్డాడు. దీంతో తలకు తీవ్ర గాయం కావడంతో బంధువులు ప్రొద్దుటూరుకు తరలించారు. చికిత్స పొందుతూ నేడు మృతి చెందాడు.