ప్రభుత్వ పాఠశాలల్లో మెరుగైన విద్య: ఎమ్మెల్యే
కోనసీమ: ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు మెరుగైన విద్యను అందించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని పీ.గన్నవరం ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ అన్నారు. ఆయన అంబాజీపేట మండలంలోని తొండవరం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల వద్ద రూ.67 లక్షల వ్యయంతో నూతనంగా నిర్మించిన పాఠశాల అదనపు తరగతి రోజుల భవన నిర్మాణాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు పాల్గొన్నారు