ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో స్పాట్ అడ్మిషన్లు
ELR: బుట్టయిగూడెం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో వివిధ కోర్సుల్లో మిగిలిన సీట్ల భర్తీకి స్పాట్ అడ్మిషన్లు జరుగుతున్నట్టు ప్రిన్సిపాల్ డా. మనేంద్రరావు తెలిపారు. BA (పాలిటిక్స్)లో 26, BA(హిస్టరీ)లో 8, BSC(జువాలాజీ)లో 28, B.COM(జనరల్)లో 48 సీట్లు ఖాళీలు ఉన్నట్టు పేర్కొన్నారు. ఇంటర్మీడియట్ పాసైన విద్యార్థులు ఈనెల 20లోపు వారికి నచ్చిన కోర్సుల్లో చేరాలన్నారు.