భవనంపై నుంచి పడి యువకుడు మృతి
HYD: అశోక్ నగర్‌లోని ఓ హాస్టల్ భవనంపై నుంచి కిందపడి యువకుడు మృతి చెందాడు. ఈ ఘటన దోమలగూడ ఠాణా పరిధిలో చోటుచేసుకుంది. మృతుడు భూపాలపల్లి జిల్లా అంబడపల్లి గ్రామానికి చెందిన బాసని ఆనంద్(26)గా పోలీసులు గుర్తించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.