నంద్యాల కుర్రాడి సత్తా

నంద్యాల కుర్రాడి సత్తా

NDL: రెండు రోజులుగా బాపట్ల జిల్లాలో జరుగుతున్న స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ జాతీయ స్థాయి చదరంగ పోటీల్లో నంద్యాల పట్టణం ఏపీ మోడల్ స్కూల్లో 9వ తరగతి చదువుతున్న హర్షవర్ధన్ ఆచారి సత్తా చాటారు. మూడవ స్థానం సాధించి జాతీయస్థాయి పోటీలకు ఎంపికైనట్లు మంగళవారం చెస్ మాస్టర్ మహేశ్ తెలిపారు. జిల్లా చెస్ అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శులు రవికృష్ణ , హర్షవర్ధన్‌ను అభినందించారు.