ఘోర రోడ్డు ప్రమాదం.. వ్యక్తి మృతి
KMM: కూసుమంచి మండలం మల్లెపల్లి వద్ద నిన్న జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందగా, మరొకరు గాయాలపాయలైనట్లు స్థానికులు తెలిపారు. వేగంగా వెళ్తున్న ట్రాక్టర్ అదుపుతప్పి పల్టీ కొట్టడంతో నేలకొండపల్లి మండలం మోటాపురం గ్రామానికి చెందిన గుగులోతు రవి (24) అక్కడికక్కడే మృతి చెందినట్లు వెల్లడించారు. గాయపడిన వ్యక్తిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.