గజ్వేల్: సహాయక చర్యలు చేపట్టిన పోలీసు అధికారులు

SDPT: భారీ వర్షాలకు ప్రజ్ఞాపూర్ ఊర చెరువు ఉదృతంగా మత్తడి దూకుతూ నీరు ప్రవహిస్తోంది. దీని ద్వారా మెయిన్ రోడ్ వైపు నీరు ప్రవహించి వాహనదారులకు, ప్రజలకు ఇబ్బందిగా మారింది. ఈ మేరకు ACP నరసింహులు ప్రదేశాన్ని పరిశీలించి ప్రజలకు ఇబ్బంది కలగకుండా జేసీబీ సహాయంతో నీటి ప్రవాహాన్ని వేరే వైపు మళ్లించాలని అధికారులకు సూచించారు.