'టికెట్లు అమ్ముకునే సంస్కృతి టీడీపీకి లేదు'
KRNL: ఎన్నికల్లో డబ్బులకు టికెట్లు అమ్ముకునే సంస్కృతి టీడీపీకి, టీజీ కుటుంబానికి లేదని మంత్రి టీజీ భరత్ స్పష్టం చేశారు. కర్నూలు కార్పొరేటర్ ఎన్నికల్లో డిపాజిట్లు ఇస్తేనే టికెట్లు ఇస్తారన్న పుకార్లపై ఆయన బుధవారం స్పందించారు. వార్డుల్లో ప్రజలకు అండగా ఉన్న వారికే టికెట్లు కేటాయిస్తామని, టికెట్ ఇచ్చే ముందు సర్వేలు చేయిస్తామని మంత్రి ప్రకటించారు.