రాజంపేటలో మహిళ ఆత్మహత్యాయత్నం

రాజంపేటలో మహిళ ఆత్మహత్యాయత్నం

అన్నమయ్య: మనస్తాపంతో మహిళ ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన జిల్లాలో చోటుచేసుకుంది. రాజంపేట రైల్వే స్టేషన్‌ సమీపంలో ఓ మహిళ రైలు పట్టాలపై కూర్చోని ఉంది. గమనించిన స్థానికులు ఆమెను రక్షించారు. సదరు మహిళ భర్త పదేళ్ల క్రితం వదిలిపెట్టడు. దీంతో కుటుంబ పోషణకై అప్పులు చేసింది. అప్పులోళ్లు డబ్బులు కట్టమనే వేధింపులు తాళలేక ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు తెలిపారు.