మెడికల్ కాలేజీలపై మంత్రి డోలా కీలక వ్యాఖ్యలు

మెడికల్ కాలేజీలపై మంత్రి డోలా కీలక వ్యాఖ్యలు

AP: YCP కోటి సంతకాల సేకరణ ఎందుకు చేస్తుందో అర్థం కావడం లేదని మంత్రి డోలా వీరాంజనేయ స్వామి అన్నారు. జగన్ హయాంలో మెడికల్ కాలేజీల నిర్మాణానికి రూ.8500 కోట్లు ఇస్తే రూ.1500 కోట్లు కూడా ఖర్చు చేయలేదని, 18% కూడా పనులు పూర్తి చేయలేదని విమర్శించారు. కాలేజీలను ఎవరికీ ధారాదత్తం చేయట్లేదని స్పష్టంచేశారు. జగన్ చేసిన పాపం ఫలితంగా రాష్ట్రం అప్పుల ఊబిలో కూరుకుపోయిందని దుయ్యబట్టారు.