జనసేన పార్టీ కార్యాలయంలో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు

VZM: కొత్తవలస ఎస్.కోట ప్రధాన రహదారిలో ఉన్న తుమ్మికాపల్లిలో జనసేన పార్టీ ఆద్వర్యంలో 79 స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు ఇవాళ ఘనంగా నిర్వహించారు. జాతీయ జెండాను కొత్తవలస అధ్యక్షులు గొరపల్లి రవికుమార్ కార్యకర్తల సమక్షంలో ఎగురవేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ స్వాతంత్య్రం కోసం దేశ నాయకులు ఎంతో శ్రమించారని గుర్తు చేశారు. కార్యక్రమంలో ఏ. సురేష్, తదితరులు పాల్గొన్నారు.