నేటి నుంచి రాష్ట్రపతి వింటర్ వెకేషన్

నేటి నుంచి రాష్ట్రపతి వింటర్ వెకేషన్

TG: హైదరాబాద్‌లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము శీతాకాల విడిది ఇవాళ్టి నుంచి ప్రారంభం కానుంది. ఈరోజు ఆమె బొల్లారంలోని 'రాష్ట్రపతి నిలయం'కు చేరుకుంటారు. ప్రెసిడెంట్ పర్యటన నేపథ్యంలో పోలీసులు భారీ భద్రత ఏర్పాటు చేశారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా నగరంపై పూర్తి నిఘా ఉంచారు. పలుచోట్ల ట్రాఫిక్ ఆంక్షలు కూడా ఉండే అవకాశం ఉంది.