'కులగణన రీసర్వేకు అవకాశం ఇచ్చాం'

SDPT: కులగణన రీ సర్వేకు సంబంధించి గత నెల 16 నుంచి 28 వరకు అవకాశం ఇచ్చామని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. సోమవారం క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మంత్రి మాట్లాడుతూ.. బీసీ రిజర్వేషన్లపై శాసనసభలో తీర్మానం చేసి కేంద్రానికి పంపుతామని తెలిపారు. కులగణనను తమిళనాడు మాదిరిగా షెడ్యూల్లో పెట్టవలసిన బాధ్యత రాష్ట్ర బీజేపీ నాయకులకు ఉందన్నారు.